తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ : ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే
భూపాలపల్లి, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మని,జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయా లకు అద్దం పట్టే విధంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎస్పీ కిరణ్ ఖరే దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని మహి ళ పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ అధికారుల కుటుం బ సభ్యులు పాల్గొన్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుక మ్మలతో మహిళా పోలీసు ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నా రులతో ఎస్పీ కిరణ్ ఖరే, ఎస్పీ సతీమణి దిశా ఆటపాటలతో బతుకమ్మ ఆడి సంబరాలు చేశారు. బతుకమ్మ ఆటపాటల మధ్య జరిగిన ఈ ఉత్సవాలలో మహిళ పోలీస్ అధికారులు, కుటుంబ సభ్యులు ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ పూలనే దేవుడిలా భావిస్తూ బతుక మ్మ ఉత్సవాలు జరపడం కేవలం మన రాష్ట్రంలోనే ఉంద న్నారు. పండగ వాతావరణంలో తీరొక్క పూలతో కలర్ ఫుల్ గా జరుతున్న ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినంద నలు తెలిపారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే పండుగ బతుకమ్మను అత్యంత వైభవంగా జరు పుకోవాలన్నారు. జిల్లా ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మ జరుపుకుంటారన్నారు. ప్రకృతితో మమేకమయ్యే పండుగ బతుకమ్మ అని కొనియాడారు. ప్రపంచంలో పూలను పూజించే సంస్కృతి తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, కష్టాలను తొలగించాలని గౌరమ్మను ప్రార్థిస్తున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్ బోనాల కిషన్ దంపతులు, భూపాలపల్లి, కాటారం, డిఎస్పీలు ఏ సంపత్ రావు, జి రామ్మోహన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, జిల్లాలోని సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.