ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

– టీజీటీ డబ్ల్యూ ఆర్ డి సి బాలికల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాధిక,

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం టి డబ్ల్యూ సిఆర్ డిసి కాలేజీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బతు కమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగు రంగుల పూలతో బతుకమ్మను ఒకచోట పేర్చి కళాశాలలో విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మ ఆటలు ఆడారు. బతు కమ్మ ఆటలతో కళాశాలలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రాధిక, ఎస్సై తాజుద్దీన్ లు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదా యాలను విద్యార్థులకు తెలియజేయాలని ఉద్దేశంతో కళాశాలలో బతు కమ్మ వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. మానసిక ఉల్లాసంతో పాటు బతుకమ్మ విశిష్టతను తెలియజేయాలని ఉద్దేశంతో బతుకమ్మ ఆటలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు సమాజం పట్ల అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం అన్నారు. అనంతరం విద్యార్థులు బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీలు, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment