వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మల సంబరాలు.
వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బతుకమ్మల సంబరాలు.
- ఆడి పాడిన మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది :ములుగు జిల్లా వాజేడు మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం బతుకమ్మల పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మేళ వింపుతో, వైద్యశాల ఆవరణ బతకమ్మల పాటలతో హోరెత్తించింది. ఈ సందర్భంగా బతుకమ్మ లను భక్తిశ్రద్ధలతో అందంగా అలంకరించి, బతకమ్మల పాటలతో భక్తి పారవశ్యముతో బతుకమ్మల పాటలతో ఆడి పాడి సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను సమీపంలోని జలాశయంలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మండల అధికారులు మండల ఎంపీడీవో, ఎంపీ ఓ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ కొమరం మహేంద్ర , డాక్టర్ మధుకర్, డాక్టర్ జ్ఞానస, సూపర్వైజర్స్ వెంకట్, రమణ, కుప్పిలి కోటిరెడ్డి, ఏఎన్ఎంలు లలిత కుమారి, ఛాయదేవి, రాజేశ్వరి, కన్యాకుమారి, ఆశా కార్యకర్తలు. శాంత కుమారి, దేవి,జ్యోతి, సరిత శివకుమారి, స్రవంతి, స్టాఫ్ నర్స్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.