ములుగు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా బానోతు రవి చందర్
ములుగు ప్రతినిధి:ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షు డిగా పనిచేసిన బానోతు రవిచందర్ ను నేడు ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తన నియామకానికి సహకరించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి దనసరి సూర్య లకు, జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్య తను తనకు అప్పగించినందుకు అహర్నిశలు కష్టపడుతూ నిర్వర్తిస్తానని తెలిపారు.