రుణగ్రస్తులతో బ్యాంకు అధికారులు మీటింగ్
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ఏటూరునాగారం మండల పరిధిలోని చిన్నబోయినపల్లిలో కాకతీయ గ్రామీణ వికాస బ్యాంక్ మేనేజర్ అండ్ రీజినల్ మేనేజర్ వచ్చి జేఎలిజి రుణాలు తీసుకున్న లబ్దిదారులతో మాట్లాడారు. రీజి నల్ బ్యాంకు మేనేజర్ మాట్లా డుతూ ఒక్కొక్క జెఎల్ జీ సంఘ సభ్యులు ఐదుగురు కలిసి ఒకటే సారి కట్టినట్టయితే 50 శాతం వడ్డీ రాయితీ ఇస్తామని తెలియజేశారు. మరియు జెఎల్డీ రుణాలు తీసు కున్న సభ్యులందరూ రుణాలు మాఫీ అయితాయని భావించి కట్టకపోవడంతో తీసుకున్న రుణాల కు వడ్డీ పడి అధిక మొత్తంలో చెల్లించవలసి వస్తున్నది , కావున జే ఎల్ జి సభ్యులను ఉ ద్దేశించి మాట్లా డుతూ తెలంగాణా ప్రభుత్వం లో హరితహారం లో భాగంగా ఏజెన్సీ గ్రామమైనటు వంటి చిన్న బోయినపల్లి ఫారెస్ట్ అధికారులు భూములను అడ్డుకొని దున్ననివ్వకుండా వంట చేసుకొని ఇవ్వకుండా చేయడం వలన మీరు బకాయిలు చెల్లించలేదని గ్రామ ప్రజలందరూ కలిసి ఏకతాటిలో చెప్పడంతో మా యొక్క పరిధిని చూసుకొని 50 శాతం మినహాయింపు చేసి మిగతా డబ్బులు కట్టవలసిందిగా తెలియజేశారు జే ఎల్ జి సభ్యులందరూ కలిసి రైతు కమిటీ అధ్యక్షుడు వాడకాపురం సౌరయ్య ఆధ్వర్యంలో బ్యాంక్ రీజినల్ మేనే జర్కి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ జగోర్, ఫీల్డ్ అసిస్టెంట్ర సురేష్, అడ్వకేట్ సిహెచ్ వెంకటసుబ్బయ్య, రామచంద్ర మూర్తి, చిన్న బోయినపల్లి రైతు కమిటీ అధ్యక్షుడు వాడకాపురం సారయ్య మాజీ ఎంపీపీ మెహర్ నిషా పత్తి మహమ్మద్ వార్డ్ నెంబర్ సూర్ణాన్ కోడం శారద కాజా పాషా గంట బుచ్చింరెడ్డి మెరుగు ప్రసాద్, బ్యాంకు మిత్ర కవిత,సిఏ శ్రీలత, జేఎల్ జి సభ్యులందరూ పాల్గొన్నారు.