బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడిగా బలరాం
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : బీజేపీ ములుగు జిల్లా అధ్య క్షుడిగా సిరికొండ బలరాం నియమిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు పట్టణానికి చెందిన బలరాం విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసారు. కర సేవకుడిగా బాబ్రీ కూల్చివేత ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొ న్న ఆయన 15రోజులు జైలు శిక్ష అనుభ వించారు. బీజేపీ ములుగు పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న బలరాంను రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియ మించారు. తన నియామకం పట్ల బలరాం రాష్ట్ర అధినాయత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.పార్టీని జిల్లాలో బలపరిచేందుకు కృషి చేస్తానని అన్నారు.