త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ. 

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి :  బక్రీద్ పండుగను ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని ముస్లింలు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా బక్రీద్ పండుగను ఘనంగా జరుపు కున్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ముస్లిం సోదరులు సోమవారం బక్రీద్ నమాజ్ ప్రార్ధనలు చేశారు.త్యాగానికి ప్రతీక ఈద్, ఉల్,అదా బక్రీద్ ప్రాముఖ్యత దాని, విశిష్టతను ఇమామ్ అబ్దుల్ రహమాన్ భక్తులకు వివరించారు.త్యాగం,స్నేహం, పవిత్రత,దయ గుణానికి ప్రతీక గా నిలిచిన పవిత్రమైన రోజు బక్రీద్ పండుగ అని అన్నారు. నాడు వారు చేసిన త్యాగాలకు ముస్లిం సోదరు లందరూ కూడా బక్రీద్ రోజు పొట్టేలు గాని,మేకపోతు గాని కుర్బానీ చేసి మూడు భాగాలు చేసి ఒక భాగము పేదవారికి,రెండవ భాగము బంధువులకి,మూడో భాగం కుర్బానీ ఇచ్చిన వారు ఉంచుకోవడం జరుగుతుందని తెలిపారు. త్యాగానికి ప్రతీక గా జరుపుకునే బక్రీద్ పండుగ ముస్లింలకు ఎంతో ప్రత్యేక మైనదని అన్నారు.ఈ పండుగను కుర్బానీ పండుగ లేదా ఈద్ అల్ అదా అని కూడా పిలుస్తారని తెలిపారు.రంజాన్ తర్వాత వచ్చే ఇస్లామిక్ క్యాలెండర్ లో ముఖ్యమైన నెలలో ఈ నెల ఒకటని. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో బక్రీద్ జరుపుకుంటారని తెలిపారు. నమాజ్ అనంతరం నిర్వ హించిన ప్రార్థనలో, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారో గ్యాలతో ఉండాలని.ఆ అల్లా ప్రతి ఒక్కరి కష్టాలను దూరం చేయాలని కోరటం జరిగిందని తెలిపారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మత పెద్దలు సయ్యద్ హుస్సేన్ ,సయ్యద్ షబ్బీర్ ,సయ్యద్ అన్వర్ ,షేక్సయ్యద్ మస్తాన్ పాల్గోనగా ఇమామ్ అబ్దుల్ రహమాన్ ముస్లిం సోదరులతో నమాజ్ ప్రార్ధన లు నిర్వహించారు.