బహుజన పోరు బిడ్డ చాకలి ఐలమ్మ 

బహుజన పోరు బిడ్డ చాకలి ఐలమ్మ 

బహుజన పోరు బిడ్డ చాకలి ఐలమ్మ 

– 129 వ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి:బహుజన పోరు బిడ్డ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కాటారం మండల రజక సంఘం నాయకులు పేర్కొన్నా రు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం గారేపల్లి లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి 129వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు పెనుగొండ రాజయ్య మాట్లాడుతూ నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన చాకలి ఐలమ్మ స్ఫూర్తిని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. రజక వృత్తి లోని పేద, బడుగు, బలహీన వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు ఇంకా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పైడాకుల సతీష్ ,పైడాకుల మహేందర్, నడికుట లింగయ్య, మూసాపూర్ ఐలయ్య, కల్లగుంట సురేష్ బాబు, గుండ్ల పెళ్లి హరీష్, అశోక్, కనుకుల పవన్, పున్నాం శంకర్, పెనుగొండ శ్రీను, పున్నం రమేష్, పెనుగొండ రమేష్ తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి అంగరంగ వైభవంగా జయంతి వేడుకలు నిర్వహించారు.