బగ్గుమన్న కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు..! 

బగ్గు మన్న కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు..! 

బగ్గుమన్న కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు..! 

– పోటా పోటీ గా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో ఉక్కు మహిళ స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీలో నెలకొని వున్న వర్గ విభేదాలు కారణంగా వేరు, వేరుగా   నిర్వహించా రు. మండల కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహం ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో పార్టీ నేతలు పూల మాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ నేతలు ఇందిర గాంది దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం మరో వర్గం కాంగ్రెస్ యువ నేత తన అనుచర వర్గంతో ఇందిరా గాంధీ జయంతి వేడుకలను నిర్వహిం చారు. ఆమె విగ్ర హానికి పూలమాలలు వేసి ఘనంగా నివా ళులు అర్ఫించి ఆమె సేవలను కొనియాడారు. జయంతి ఉత్సవాల సంద ర్భంగా మండల కాంగ్రెస్ పార్టీలోని వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు అయోమయంలో పడ్డా మని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని వాట్సా ప్ గ్రూపులలో పోటాపోటీగా జయంతి వేడుకలు ఫోటోలు, ప్రకటనలను రెండు వర్గాల కాంగ్రెస్ నాయకులు పోస్టింగులు చేశారు.