కారు ఓనర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా బాదం ప్రవీణ్.
ములుగు, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ గార్డెన్ లో సమ్మక్క సారక్క కారు ఓనర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మేకల సంజీవ ఆధ్వర్యంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా బాదం ప్రవీణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం బాదం ప్రవీణ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. మీ కష్టసుఖాలలో తోడుంటు ప్రతిక్షణం మీ తోడు నీడగా ఉంటానని తెలిపారు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నావల్ల జరిగే ప్రతి చిన్న పని కూడా చేస్తానని, తప్పకుండా ప్రతి ఒక్కరు ఎల్లవేళలా ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అన్నారు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ఏదైనా కూడా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. అందరం ఒక కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉండి వచ్చిన సమస్య లను పరిష్కరించుకుందామని అన్నారు. ఈ కార్యక్ర మంలో ఉపాధ్యక్షుడు బొమ్మగాని భాస్కర్, ప్రధాన కార్యదర్శి లోకు రాజేష్, కార్యదర్శి ఉప్పుల రాజు, జాయింట్ సెక్రెటరీ మాట్లా బద్రి, ముఖ్య సలహాదారులు అప్రోజ్ ఖాన్, మీడియా ఇన్ఛార్జ్ గుగ్గిళ్ళ సుజన్, కమిటీ సభ్యులు, బండ సురేష్, రమేష్, కోమల్ రెడ్డి, అజ్మీరా రామ్ సింగ్, అజ్మీర కిషోర్ నాయక్, రాజేందర్, నన్నబోయిన రాజేందర్, పొడిచెట్టి రాజేందర్, మూసినపల్లి శ్రావణ్, తరుణ్, రమేష్, కిరణ్, క్రాంతి కుమార్, పిట్టల గిరి, కుమారస్వామి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.