వాజేడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.
ఇరువురు మృతి – మరొకరికి తీవ్రగాయాలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం పాయ బాట్ల గ్రామాల సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వాహన డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సేకరించిన వివరాలు ప్రకారం… జగన్నాధపురం వై జంక్షన్ సమీపంలోని పాయబాట్ల జగన్నాధపురం గ్రామాల వద్ద జాతీయ రహదారి ఎన్ హెచ్ 163 పై శుక్రవారం సాయంత్రం బోలెర వాహనం ఆగి ఉన్న ఐరన్ లోడు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, వాహనం డ్రైవర్ తీవ్ర గాయాలు పాలయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే వాజేడు పోలీసులు క్షత గాత్రులను ఎటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలిం చారు. రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన వారి వివరాలు, వారి పేర్లు తెలుసుకు నేందుకు వాజేడు పోలీసులు సమాచారం రాబట్టే దిశలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే చతిస్గడ్ ప్రాంతానికి చెందిన వారుగా భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన వారి వద్ద ఎటు వంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో పూర్తి సమాచారం తెలియ టం లేదు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరా లు తెలియాల్సి ఉంది. ఈ మేరకు వాజేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.