వెంకటాపురంలో వైభవంగా అయ్యప్పల నగర సంకీర్తన
వెంకటాపురంలో వైభవంగా అయ్యప్పల నగర సంకీర్తన
– అయ్యప్పలకు భక్తుల నీరాజనాలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప ఆలయం నుండి సోమవారం రాత్రి అయ్యప్ప స్వాములు, చిన్నారి మాతలతో కలిసి నగర సంకీర్తనను వైభవంగా సంకీర్తనల నడుమ నిర్వహించారు. నగర సంకీర్తన లో పాల్గొన్న అయ్యప్పలకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న గృహస్తులు, వ్యాపార వర్గాలు, భక్తులు అయ్యప్పలకు శుద్ది జలాన్ని ఆరబోసి భక్తి శ్రద్ధలతో హారతులు ఇచ్చి అయ్య ప్పల ఆశీర్వాదం పొందారు. సుమారు రెండు కిలోమీటర్ల పైగా సాగిన అయ్యప్ప ల నగర్ సంకీర్తన రాత్రి పొద్దుపోయే వరకు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్దకు చేరుకొని, అక్కడి నుండి జ్యోతిని వెలిగించుకొని తిరిగి అయ్యప్ప మాలధారణ భక్తుల నినాదాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మమ్మ గుడి వరకు సాగి తిరిగి అయ్యప్ప స్వామి వారి ఆలయానికి చేరుకున్నది. ఈ సందర్భంగా స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ శరణు ఘోషతో గురు స్వాముల భక్తిరస కీర్తనలతో, స్వామివారి నామంతో లౌడ్ స్పీకర్లతో వెంకటా పురం పట్టణాన్ని అయ్యప్ప స్వామి నామ శరణు ఘోషతో దద్దరిల్లింది.ఈ సందర్భంగా అనేకమంది భక్తులు స్వామి వారికి కానుకలు సమర్పించగా, భక్తులకు స్వామివారి ఇష్ట పూర్వకమైన ప్రసాదాలను పంపిణీ చేశారు.