ములుగులో వైభవంగా అయ్యప్ప పడిపూజ 

ములుగులో వైభవంగా అయ్యప్ప పడిపూజ 

ములుగులో వైభవంగా అయ్యప్ప పడిపూజ 

ములుగు ప్రతినిది: అయ్యప్ప మాల ధారణ భక్తుల నగర సంకీర్తన, పడిపూజ మహోత్సవం గురువారం ములుగులో వైభవంగా జరిగింది.భక్తమండలి ఆధ్వర్యంలో గురువారం మాల ధారణ భక్తులు రామాలయం నుంచి జాతీయ రహదారి మీదుగా శివాలయం మీదుగా తిరిగి రామాలయం వరకు వీధుల్లో నగర సంకీర్తన చేస్తూ తిరిగారు. ఈ సందర్భంగా శివపార్వతులు, వినాయకుల వేషధారణతో భక్తులు వేసిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. అనంతరం రామాలయ ప్రాంగ ణంలో 18 మెట్లతో కూడిన పడిపూజ ఉత్సవాన్ని ఘనంగా మాల ధారణ భక్తులు నిర్వహించారు. గురుస్వాము లు ప్రత్యేక మంత్రోచ్ఛారణలతో పూజలు నిర్వహించగా పట్టణ కేంద్రంలోని భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమంలో భక్తమండలి సభ్యులు చింతల పూడి భాస్కర్ రెడ్డి, పైడిమల్ల గోపి, కొత్త సురేందర్, వాసుదేవ రెడ్డి, బాణాల రాజ్ కుమార్, సానికొమ్ము శ్రీనాథ్ రెడ్డి, ఆవుల ప్రశాంత్ రెడ్డి, రవి రెడ్డి, స్వాము లు రమేష్, ఓం ప్రకాష్, గోపి కృష్ణ, రవీందర్, రాకేష్ రెడ్డి, కుమా ర్, బిట్టు, సంతోష్, రంజిత్, భద్రయ్య,సురేందర్,శ్రీనివాస్లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

ములుగులో వైభవంగా అయ్యప్ప పడిపూజ 

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment