ధర్మవరంలో ఇంటింటికి అయోధ్య శ్రీరామ అక్షింతల పంపిణి. 

ధర్మవరంలో ఇంటింటికి అయోధ్య శ్రీరామ అక్షింతల పంపిణి. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం గ్రామంలో సోమవారం అయోధ్య శ్రీరామ జన్మభూమి కమిటి ఆధ్వర్యంలో ఇంటింటికి శ్రీ రామ అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి అక్షింతల కలశాలను శ్రీరామ భక్తులు, మహిళా భక్త సోదరిమణులు, డప్పు వాయిద్యాల మధ్య మంగళ వాయిద్యాల తో అత్యంత భక్తిశ్రద్ధలతో వీదుల్లో శుద్ధి జలంతో స్వాగతం పలికి గ్రామంలోకి ఆహ్వానించారు. జై శ్రీ రామ జై జై శ్రీరామ జై శ్రీ ఆంజనేయ అనే నినాదాలతో ధర్మవరం గ్రామం మార్మోగింది. పాడి పంటల వ్యవసాయ గ్రామమైన ధర్మవరం చుట్టుపక్కల గ్రామాలు లో పాడిపంటలతో, ఎల్లవేళలా పంటల పచ్చదనంతో కళకళ లాడాలని,ప్రతి కుటుంభానికి అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని, అయోధ్య శ్రీ రాముడి ఆశీర్వాదంతో అందరూ సుఖ శాంతులతో ఉండాలని ఈ సందర్భంగా భక్తులు అక్షింతల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, భక్తి శ్రథ్థలతో గడపగడపకు, ఇంటింటికి పంపిణీ చేశారు. శ్రీ రామ భక్తులకు అయోధ్యలో అపూర్వమైన ఆనందకరమైన వాతావరణంలో జరిగే శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తిలకించి పునీతులు కావాలని, ఈ సందర్భంగా కోరారు. శ్రీరామ జయరామ జై జై రామ అనే మహా మంత్రమును ప్రతి ఒక్కరు జపించాలని, హనుమాన్ చాలీసా సుందర కాండ శ్రీ రామరక్షా స్తోత్రం వంటివి పారాయణం చేయాలని ,ఈ సందర్భంగా భక్త మండలి శ్రీరామ భక్తులు అక్షింతల పంపిణీ కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. విశ్వవ్యాప్త రామ భక్తులు ప్రతి ఒక్కరు అయోధ్య వెళ్లి తిలకించే అవకాశం లేనందున,అయోథ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ విశ్వవ్యాప్తంగా టీ.వీ.లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదం పొందాలని ఈ సందర్భంగా భక్తులు అక్షింతలు పంపిణీ కార్యక్రమంలో కోరారు. శ్రీరామ జన్మభూమిలో నిర్మాణం అవుతున్న దివ్య మందిర వివరాలతో కూడిన స్వామివారి ఆకర్షణ నీయమ యిన పత్రికలను ఇంటింటికీ పంపిణీ చేశారు. డప్పు వాయిద్యాల తో, శ్రీ రామ నామ జపం చేస్తూ ప్రతి ఇంటికి అక్షింతలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొల్లె నాగేశ్వరరావు, బలుసు పాటి రాములు, కొప్పుల ప్రవీణ్, గార రవి, శ్రీరాముని ఆలయ కమిటీ సభ్యులు,  గ్రామస్తులు, భక్త సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ధర్మవరంలో ఇంటింటికి అయోధ్య శ్రీరామ అక్షింతల పంపిణి. ”

Leave a comment