కాటారంలో మహాలక్ష్మి పథకంపై అవగాహన సదస్సు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: కాటారం మండల కేంద్రంలోని ముదిరాజ్ కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా జై దేవ్ ఇండి యన్ గ్యాస్ కాటారం వారి ఆధ్వర్యంలో గ్యాస్ వినియోగ దారులకు ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపై అవగా హన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాటారం మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్ హా జరై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకంలో గ్యాస్ సబ్సిడీ వర్తింపజేసే విధానాలపై ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. ప్రజా పాలన ప్రజా విజయో త్సవాల కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని కావున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకొని అభివృద్ధి చెందాలని మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. ఇండియన్ గ్యాస్ డిస్ట్రి బ్యూటర్ దేవరాజ్ మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం అం దిస్తున్న సబ్సిడీని వర్తింపజేసేందుకుగాను గ్యాస్ వినియోగ దారులు తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా జిరాక్స్, మొబైల్ నెంబరు కలిగివుండి గ్యాస్ ఏజెన్సీ వద్దకు వారి యొక్క కన్జ్యూమర్ బుక్కుతో వెళ్లి సబ్సిడీ పొందవచ్చునని తెలియపరిచారు. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంది స్తున్న సబ్సిడీని అర్హులైన ప్రతి ఒక్క గ్యాస్ వినియోగదారులు సద్వినియోగపరుచుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది, వినియోగదారులు, స్థానిక ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.