వాజేడులో క్షయ వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన ర్యాలీ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో, పేరూరు, వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సంయుక్తంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు, పి.ఒ టిబీ డాక్టర్ చంద్రకాంత్ ఆదేశాల మేరకు మెడికల్ ఆఫిసర్ డాక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్షయ నిర్మూలన రోజు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమావేశం నిర్వహించి డాక్టర్ మహేందర్ మాట్లా డుతూ రెండు వారాలకు మించి దగ్గు ఉన్న, ఛాతిలో నొప్పి ఉన్న, తెమడలో రక్తం ఉన్న, సాయంత్రం పూట జ్వరం వచ్చిన, రాత్రిపూట చెమటలు పట్టిన, బరువు తగ్గిన వెంటనే తెమడ పరీక్ష చేయించుకోవాలని తెలియజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ప్రతి పంచాయతీని టీ.బీ రహిత పంచాయితీగా నిర్మించాలని ప్రతి ఆశా కార్యకర్త మరియు ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వ్యాధులకు గురయ్యే వర్గం నుంచి నిబద్ధత తో నమూనాలు సేకరించి, కేసులను గుర్తించి చికిత్స చేసి టీబీ రహిత వాజేడు మండలంగా తయారు చేయాలని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేందర్, డాక్టర్ మధుకర్, డాక్టర్ యోషిత, డాక్టర్ గ్యనస, హెచ్ ఇ వో వేణుగోపాలకృష్ణ, హెచ్ ఎస్ కుప్పిలి కోటి రెడ్డి, నోడల్ పర్సన్ శ్రీను, శేఖర్ తిరుపతి, నాగేంద్రకుమారి, సత్యనాగవేణి, అనుషా ఛాయాదేవి, రాజేశ్వరి కన్యా కుమారి తదితరులు పాల్గొన్నారు.