సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : మండలంలోని ఇంద్రానగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సైబర్ నేరాలపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరా లపై అవగాహన కలిగి ఉండాలని జరుగుతున్న అభివృద్ధిలో సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా మోసం చేస్తున్నారని, సెల్ ఫోన్ పై అవగాహన ఉన్న విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన్లు, కీప్యాడ్ ఫోన్లకు ఓటీపీల రూపంలో వివరాల కోసం ఎవరైనా ఫోన్ చేసిన, మెసేజ్ చేసిన వెంటనే బ్యాంకు సమాచారం తెలియ జేయవద్దని, బ్యాంకు సిబ్బంది ఫోన్ చేసి అడగరని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని నేటి బాలలే రేపటి పౌరులుగా మారాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడులు అందజేసి విద్యార్థులను చదు వులో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు లు విద్యార్థులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.