సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు
సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు
– ముందస్తు ప్రణాళికతో వాజేడు మండల అధికారులు
– విష జ్వరాల పట్ల అవగాహన సదస్సు
– సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు
– గోదావరి ముంపు ప్రాంతాలకు తగు జాగ్రత్తలు సూచనలు
తెలంగాణ జ్యోతి, వాజేడు : మండల కేంద్రము లోని బొల్లారం గ్రామంలో సీజనల్ వ్యాధులపై కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ వారు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్య క్రమానికి వాజేడు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ మహేందర్, వాజేడు మండల ఎం. పి. డి.ఓ. విజయలక్ష్మి , ఎం. ఆర్.ఓ. శ్రీనివాసరావు ఎం.పి.ఓ. శ్రీకాంత్, హెల్త్ సూపర్ డెంట్ సూర్యప్రకాష్ పాల్గొన్నారు. వాజేడు ప్రభుత్వ డాక్టర్ మహేందర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన ఉండాలని మరియు దోమ తెరలు వాడాలని మరుగుదొడ్లను ఉపయోగించాలని ఆశా వర్కర్లు ఎల్లవేళల మీకు అందు బాటులో ఉంటారని తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఎం. పి.డి. ఒ. విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మద్యానికి, మత్తుకు బానిస కాకూడదని వివరించారు. అంతే కాకుండా ప్రతీ కుటుంబానికి మరుగు దొడ్లు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరియు ఎం. ఆర్. ఓ. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి కుటుంబం రేషన్ బియ్యంలో చాలా పౌష్టిక వనరుల ఉన్నాయని ఆహారానికి రేషన్ బియ్యాన్ని వినియోగించు కోవాలని తెలియజేశారు ఈ యొక్క గ్రామం లో కంటిచూపు సమస్యలు ఉన్నందున వెంటనే కటిపరిక్షలు నిర్వహించాలని ప్రభుత్వ డాక్టర్ కి సూచించారు.అదేవిధంగా ఎం. పి. ఓ. శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ యొక్క గ్రామంలో ప్రతీ ఒక్కరూ మరుగు దొడ్లు నిర్మించుకోవాలని , ఆరుబయట మల విసర్జన చేయకూడదని వివరించారు. హెల్త్ సూపర్ డెంట్ మాట్లాడుతూ ఈ గ్రామంలో డెంగ్యూ, మలేరియ, టైఫాడ్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి తెలియ జేశారు. ప్రతీ కుటుంబం పరిశుభ్రత పాటించాలని వివరించా రు. ఈ కార్యక్రమంలో వాజేడు మండల కాపేడ్ సమన్వయ కర్త గొంది కామేష్,వెంకటాపురం మడలం సమన్వయ కర్త, హనుమంత్, యనిమాటేర్స్ రమాదేవి, స్వరూప, భాస్కర్. ఉషారాణి. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.