వెంకటాపురం సొసైటీ కార్యదర్శి సత్యనారాయణకు అవార్డు

Written by telangana jyothi

Published on:

వెంకటాపురం సొసైటీ కార్యదర్శి సత్యనారాయణకు అవార్డు

– రాష్ట్ర మంత్రి సీతక్క చేతులు మీదుగా అవార్డు స్వీకరించిన సొసైటీ కార్యదర్శి.  

– పలువురి అభినందనలు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆర్. వి .వీ. సత్యనా రాయణ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు కు ఎంపికయ్యారు. ఈ మేరకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో, గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేతులు మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు ను సత్యనారాయణ కు అందజేశా రు. వెంకటాపురం మండలంలో ప్రాథమిక సహకార సంఘం నుండి రైతులకు ఉత్తమ సేవలు అందించంటంతో పాటు, సకాలంలో ఎరువులు, పురుగు మందులు,విత్తనాలు ,వ్యవ సాయ పరికరాలు,బుణాలు ,రికవరి తదితర అంశాలపై, పాలకవర్గం సహకారంతో ఉత్తమ సేవలందించి, రైతుల ఆదరాభిమానాలు పొందినట్లు, పలువురు రైతులు అభినంద నలు తెలిపారు. ఉత్తమ ఉద్యోగి అవార్డు మంత్రి చేతుల మీదుగా స్వీకరించిన పిఎసిఎస్ కార్యదర్శి ఆర్ వి వి సత్యనారాయణ ను వెంకటాపురం పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, ఉపాధ్యక్షులు చిట్టేం ఆదినారాయణ, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ కార్యాలయం సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సంఘాలు,మిత్రులు అభిమానులు, రైతులు ఆవార్డు గ్రహిత సత్యనారాయణ కు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు తెలిపారు.

Leave a comment