సెంట్రలైజ్డ్ కిచెన్ విధానంతో వంటలు చేసే ప్రయత్నం మానుకోవాలి
– ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన రూ.10 వేల వేతనం చెల్లించాలి
– మిడ్ డే మీల్స్ యూనియన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రవీందర్
ములుగు ప్రతినిధి : పాఠశాలల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం తో హరేరామ, హరేకృష్ణ ఫౌండేషన్ ద్వారా వంటలు చేయడా నికి ప్రయత్నించడం చాలా అన్యాయని, వెంటనే విరమించు కోవాలని ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన కార్మికు ల యూనియన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్, డీఈవోల ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా రవీందర్ మాట్లాడుతూ వంట కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో అనేక పోరాటాలు నిర్వహించడం జరిగిందని, ఆనాడు జరిగిన పోరాటాలు న్యాయభధ్దమైనవి తెలుపుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు తమకు మద్ధతు తెలిపారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వంట కార్మికులకు నెలకు రూ.10వేల వేతనం అందిస్తామని హామీ ఇచ్చారని, వంట కార్మికులకు ఉద్యోగ భధ్రత కలిపిస్తామని చెప్పి ఇప్పుడు గ్రామాలలో రాజకీయ కారణాలతో కార్మికుల ను తొలగించే పనిలో పడ్డారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 8నెలలు గడుస్తున్నా వారు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,200మంది వంట కార్మికులను రోడ్డున పడేసే విధంగా సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాలు అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే 5నెలలు గా వంట బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు, అల్పాహరం బిల్లులు వేత నాలు పెండింగ్ లో ఉన్నాయని, కోడిగుడ్ల ధరలు మార్కెట్లో పెరిగిపోయాయయన్నారు. ప్రభుత్వమే సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ములుగు జిల్లా అధ్యక్షురాలు సామల రమ, ప్రధాన కార్యదర్శి గున్నాల రాజకుమారి, పోరెడ్డి ప్రమీల, ఎండీ.ఫర్వీణ, జనగాం శోభ, సామ సమ్మక్క, సరోజన, సంగు పోశమ్మ, చీకుర్తి లక్ష్మి, ఆసరి లక్ష్మి, రాజకుమారి, కమలక్క, రాధ, సలువాల స్వరూప, ఏఐటీయూసీ నాయకులు ముత్యాల రాజు, భవాని, నిర్మల, భాగ్య, మణెమ్మ, నీలమ్మ, నిర్మల, లావణ్య, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.