ఆటోవాలా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
– రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ డిమాండ్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ఆటో వాలాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ డిమాండ్ చేశారు. శనివారం జయశంకర్ భూపా లపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఆటో యూనియన్ల జేఏసీ అధ్యక్షులు పేట బక్కయ్య అధ్యక్షతన జరిగిన అత్య వసర సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్ల మీద విరుచుకుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులలో మహాలక్ష్మి ఉచిత బస్సు టికెట్ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఆటోలకు గిరాకీలు పడిపోయాయని, దాంతో మహిళలు ఆటో ఎక్కడ మే మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా రని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మృతి చెందిన ఆటో డ్రైవర్లకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రెషియా ప్రకటిం చాలని, అలాగే వారి కుటుంబాలలో ఒకరికి ఉపాధి కల్పించా లని డిమాండ్ చేశారు. 1000 కోట్ల బడ్జెట్ తో ఆటోవాలా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో తమ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నెలకు 12 వేల రూపాయలను ఆటో డ్రైవర్లకు జీవనభృతిగా యుద్ధ ప్రాతిపదికన చెల్లించాలని సమావేశం తీర్మానించింది. కాటా రం మండల ఆటో డ్రైవర్ యూనియన్ జేఏసీ కమిటీ అధ్య క్షులుగా పేట భక్కయ్య, ఉపాధ్యక్షులుగా మారపాక వెంకట స్వామి, ప్రధాన కార్యదర్శిగా జిల్లాల శంకర్, అధికార ప్రతిని ధిగా మంతని మహేష్, కోశాధికారిగా అంగడి వెంకటేష్, కార్య దర్శులుగా గద్దల తిరుపతి, సంఘం మల్లయ్య, సహాయ కార్యదర్శిగా చీర్ల శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు.