అంబులెన్స్ ను ఢీకొన్న ఆటో – నలుగురుకి గాయాలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు సమీపంలో కంకల వాగు వంతెన దాటిన తర్వాత ప్రధాన రహదారిపై గురువారం ఉదయం ఎదురుగా వస్తున్న 102 అంబులెన్స్ వాహనాన్ని ప్రయాణీకులతో వస్తున్న ఆటో డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో లో వున్న నలుగురు ప్రయాణీలు గాయపడగా రోడ్డు కిందకు ఆటో దూసుకుపోయింది. గాయపడ్డ క్షత గాత్రులను వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాల కు చికిత్స కై తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశా లకు రిఫర్ చేసినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తి సమా చారం తెలియాల్సి ఉంది.