ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లి పాల వారోత్సవాలు

ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లి పాల వారోత్సవాలు

– శిశు,సంక్షేమ అభివృద్ధి అధికారిని హేమలత

ఏటూరునాగారం,  తెలంగాణ జ్యోతి :  మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఆగస్టు 1 నుండి 7 వరకు మండలం లోని ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో తల్లి పాల వారోత్సవాలను నిర్వహించాలని సీడీపీవో హేమలత సూపర్ వైజర్లను, అంగన్వాడీ వర్కర్లను ఆదేశించారు.ఈ సందర్భంగా హేమలత విలేకరులతో మాట్లాడుతూ అమృతం కన్నా విలువైనది అమ్మపాలని, చంటి బిడ్డకు ఆరోగ్యం తో పాటు, పాలతో పోషణను అందించి,ఆరోగ్య సమాజాన్ని నిర్మించే ఉద్దేశ్యంతో “అంతరాలను తొలగించి, తల్లి పాల ప్రాముఖ్యత ను చాటుదాం ” అనే నినాదంతో తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా ముర్రుపాల ప్రాముఖ్యత, బిడ్డ పుట్టినప్పుటి నుండి ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలనే అందించడం, 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు బిడ్డకు అందించే, ఆదనపు ఆహారం పై అవగాహన కల్పించడం పైన పలు కార్యక్రమాలను చేపడుతామన్నారు.ఈ సందర్భంగా మండల కేంద్రం లోని కార్యాలయ పరిదిలోని బెస్తవాడ-1 అంగన్వాడీ కేంద్రంలో గురువారం లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిని హేమలత పాల్గొన్నారు. లబ్ధిదారులతో కూడా మాట్లాడుతూ తల్లి పాలు ఇవ్వడం వలన తల్లికి కలిగే ప్రయోజనాలు, ప్రసవం తర్వాత, రక్త స్రావం అగుతుందని, ప్రసవం తర్వాత రక్త హీనత నుండి కాపాడుతుందని, రొమ్ము కాన్సర్ ప్రమాదం నుండి కాపాడు కోవచ్చని లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సుపరువైజర్లు, వర్కర్లు, ఆయాలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పలువురు పాల్గొన్నారు.