పట్టుబడిన వాహనాల వేలం
పట్టుబడిన వాహనాల వేలం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపా లపల్లి జిల్లా కాటారం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గడిచిన కాలంలో అక్రమ మార్గాల ద్వారా గుడుంబా తదితర సామాగ్రి రవాణా చేస్తున్న క్రమంలో పట్టుబడిన వాహనాలను ఆ శాఖ అధికారులు వేలం వేశారు. బుధవారం కాటారం ఎక్సైజ్ స్టేషన్ లో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లింగాచారి సమక్షంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కిష్టయ్య ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. ఇందులో తొమ్మిది వాహనాలను వేలానికి ప్రకటించగా మొత్తం వాహనాలు పాటలో నిర్దేశిత మొత్తం 88 వేల రూపాయలకు నిర్ణయించగా, రూ.1,32,600 విక్రయం ద్వారా వేలంపాటకు ఇచ్చినట్లు తెలిపారు. రూ .17508 జీఎస్టీ ద్వారా 50.68% వృద్ధిరేటు సాధించినట్లు ఎస్సై ఎక్సైజ్ కిష్టయ్య తెలిపారు.