ఏటూరునాగారం రెవిన్యూ డివిజన్ ప్రకటనపై హర్షం
ఏటూరునాగారం రెవిన్యూ డివిజన్ ప్రకటనపై హర్షం
– సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఏటూరు నాగారం, పలాస లను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఏటూ రునాగారంను రెవిన్యూ డివిజన్ చేయాలని అనేక ఉద్యమా లు చేసినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల బాధలను అర్థం చేసుకొని మంత్రి సీతక్క చొరవతో శనివారం నాడు కేబినెట్లో ఏటూరు నాగారంను రెవిన్యూ డివిజన్ గా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకి, కీలకపాత్ర పోషించిన, మంత్రి సీతక్క లకు శుభాభివందనా లు తెలిపారు. గతంలోనే ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ గా రూపుదిద్దుకోవాలిసి ఉండేదనీ, గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. ఏటూరునాగారంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఏర్పాటు చేయలేదని, ఈ ప్రభుత్వమైనా ఏటూరు నాగారంలో ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు చేయాలని కోరారు. నూతనంగా డివిజన్ చేయడంతో నూగూరు వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరు నాగారం మండలాల ప్రజలకు రెవెన్యూ సమస్యల పరిష్కారం లో సులభ తరం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.