ములుగులో కిరాణా షాపులపై దాడులు

Written by telangana jyothi

Published on:

ములుగులో కిరాణా షాపులపై దాడులు

రూ.లక్ష 78వేల గుట్కా, అంబర్ ప్యాకెట్లు స్వాధీనం

తెలంగాణజ్యోతి, ములుగు ప్రతినిధి : ములుగులో కిరాణా షాపులపై పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహిం చారు. పక్క సమాచారం మేరకు స్థానిక హోల్సేల్, రిటైల్ షాపుల్లో దాడులు నిర్వహించగా అధిక మొత్తంలో గుట్కా, అంబర్ ప్యాకెట్లు లభ్యమైనట్లు ఎస్సై వెంకటేశ్వర్రావు తెలిపారు. సాంబశివ కిరాణా షాప్ లో నిషేధిత అంబర్ గుట్కా ప్యాకెట్లు లభ్యం కావడంతో స్వాధీనం చేసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. 15 బ్యాగుల అనార్ అంబర్ ప్యాకెట్స్, 10బ్యాగుల జేకే జర్ధా, 2 బ్యాగుల అర్ అర్ గుట్కా, 40 అంబర్ ప్యాకెట్స్ దొరికినట్లు వెల్లడిం చారు. షాపు యజమా నిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్రావు తెలిపారు. నిషేధిత గుట్కా అమ్మిన, సరఫరా చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a comment