కాటారం ఆసుపత్రిలో దారుణం

కాటారం ఆసుపత్రిలో దారుణం

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపా లపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని పీ హెచ్ సీ హాస్పి టల్లో దారుణం చోటుచేసుకుంది. సమాజంలో డాక్టర్ అంటే ఒక నమ్మకం ఉంటుంది. అలాంటి నమ్మకాన్ని ఈ లేడీ డాక్టర్ వమ్ము చేస్తుందని బాధితురాలి ఆరోపించింది. అలాంటి ఘటనే మన కాఠారం పి హెచ్ సీలో చోటు చేసుకుంది. గత మూడు రోజుల క్రితం నిండు గర్భిణీ అయిన హరిత అనే యువతి డెలివరీ కోసం కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడ్మిట్ అయ్యింది. అడ్మిట్ అయిన బాధితురాలు మాట్లాడుతూ పి హెచ్ సి డాక్టర్, సిబ్బంది అంతా కలిసి నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నిండు గర్భిణీ ఐయిన తాను డెలివరీ కోసం కాటారం పి హెచ్ సి ని సంప్రదించగా అందులోనీ డాక్టర్ మౌనిక డెలివరీకి కొంత సమయం పడుతుందంటూ పురిటి నొప్పులు వచ్చేవరకు ఎదురు చూడాలి తప్పదు అంటూ డాక్టర్ తో పాటు హాస్పిటల్స్ సిబ్బంది నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆ యువతీ గద్గద స్వరంతో విలపించింది. వాళ్ళు పెట్టే ఇబ్బందులు అన్నీ చెప్పుకోలేక పోతున్నానని కంట నీరు కార్చింది. ఈ పురిటి నొప్పులు భరించడం నా వల్ల కావట్లేదు అని చెప్పినా విన కుండా హింసాత్మకమైన వైద్యం అందించే ప్రయత్నం చేశారని విలపించింది. ఏన్ని సార్లు నన్ను వేరే హస్పిటల్ కు పంపించండి అని మొత్తుకున్నా వినకుండా, ఈరోజు నా పాప ప్రాణం తీశారు అని మొరపెట్టుకుంది. చివరికి నా పాప ప్రాణం పోయాక అప్పుడు నన్ను భూపాలపల్లి పట్టణంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు. అప్పటికి నా పరిస్థితి విషమంగానే మారింది. అప్పటికప్పుడు 100 పడకల ఆసు పత్రి డాక్టర్, అక్కడి సిబ్బందే నన్ను బ్రతికించారని చెప్పుకొ చ్చింది. కాటారం లోనే ఉంటే అక్కడి డాక్టర్, సిబ్బంది అంతా కలిసి నా ప్రాణం కూడా తీసే వారమో అంటూ బోరున విల పించింది. ఇలాంటి డాక్టర్, సిబ్బంది కారణంగానే ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్ల పైన నమ్మకం పోతుందని ఆ యువతి ఆందోళన వ్యక్తం చేసింది.