కాటారంలో అథ్లెటిక్స్ మీట్ 

కాటారంలో అథ్లెటిక్స్ మీట్ 

కాటారంలో అథ్లెటిక్స్ మీట్ 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కాటారం మండల కేంద్రమైన చింతకాని క్రాస్ రోడ్ వద్ద అథ్లెటిక్స్ మీట్ నిర్వహించారు. కాటారం ప్రైవేటు హాస్పిటల్స్ అసోసి యేషన్స్ సహకారంతో నిర్వహించిన ఈ మీట్ ను కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 200 మంది అథ్లెటిక్స్ లో పాల్గొన్నారు. అలాగే బాలబాలికలలో అండర్ 16 , 20 విభా గాలలో 32 మంది అథ్లెటిక్స్ క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అథ్లెటిక్స్ మీట్ నిర్వాహకులు తెలిపారు. ఈనెల 22న నాగర్ కర్నూల్ లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రిటెక్స్ అసోసియేషన్ చైర్మన్, కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, అధ్యక్షులు చిన్న రాజయ్య, ప్రధాన కార్యదర్శి పూతల సమ్మయ్య, ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ డాక్టర్ షఫీ, బండి శ్రీనివాస్, సురేష్ రెడ్డి, కుమార్ స్వామి, రామకృష్ణ, పిఈటీలు కర్ణాకర్ రావు,మార్క రాము లతో పాటు తదితరులు పాల్గొన్నారు.