సిల్వర్ మెడల్ సాధించిన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు
సిల్వర్ మెడల్ సాధించిన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : మండలంలోని ఊరట్టం గిరి జన ఆశ్రమ పాఠశాల, మేడారం గిరిజన ఇంగ్లీష్ మీడియం, ఇంద్రనగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు కరాటేలో సిల్వర్ మెడల్ సాధించారు కరాటే మాస్టర్ చందా హనుమం తరావు మాట్లాడుతూ ములుగు జిల్లాలోని గిరిజన భవన్లో బంగారం జరిగిన కరాటే పోటీల్లో సిల్వర్ మెడల్స్ సాధించా రు. మెదక్ జిల్లాలో జరిగిన పోటీలలో విద్యార్థులు తనుశ్రీ, స్వాత్వికలు గోల్డ్ మెడల్ సాధించారు. స్టేట్ మీట్ కు ఎంపిక య్యారు. అలాగే లవన్ కుమార్, చరణ్, హరిత, రవళి, నందినిలకు సిల్వర్ మెడల్స్ వచ్చాయి. ఇందులో భాగంగా మూతి రవళి కి మండల విద్యాశాఖ అధికారి రేగా కేశవరం చేతుల మీదుగా రజత పథకాన్ని అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణిం చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పుష్ప నీల, పి ఈ టి స్వామి, వనిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.