రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలలో రాణిస్తున్న ఆశ్రమ పాఠశాల విద్యార్థులు
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం : రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలలో ఆశ్రమ పాఠశాల విధ్యారులు రాణిస్తున్నారని చిన్న బోయినపల్లి అశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యా యులు మడే నాగేశ్వర్ అన్నారు. ములుగు జిల్లా చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న సీహెచ్.మాసయ 7వ తరగతి విధ్యా ర్ది స్కూల్ ఆఫ్ గేమ్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ టీం తరుపున జాతీయ స్థాయి ఆండర్ 14 విభాగంలో ఖోఖో క్రీడలో ఈ నెల 10 తేది నుండి12 వరకు మహరాష్ట్రలో ఆడను న్నట్లు తెలి పారు. అలాగే యం.రవి 9వ తరగతి విద్యార్ది ఆసోసి యేషన్ ఆధ్వర్యంలో ఖోఖో సభ్ జూనియర్స్ జాతీయ స్థాయి క్రీడలలో 30,31 తేది నుండి జనవరి 1వ తేది వరకు జార్ఖండ్ రాష్ట్రంలో ఆడాడని, యం. ఆదిత్య 10 తరగతి విద్యార్ది ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఖోఖో జూనియర్ అండర్-18 విభాగంలో మహ బూబ్నగర్ లో 28.29.30 ఆక్టోబర్ 2024 లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడలలో అడాడని, అలాగే యం. ఉమేష్ 9వ తరగతి విద్యార్ది, యం.చింటూ, 7వ తరగతి విద్యార్ది అండ ర్-14 సభ్ జూనియర్స్ విభాగంలో కొల్లాపూర్ లో 28,29 డిసెంబర్ నెలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడలలో అడా రన్నారు. ఈ క్రీడలలో ప్రతిభ కనబరిచిన విద్యార్దులను పీజీహె చ్ ఏం.మడే నాగేశ్వర్ రావు, డిప్యూటి వార్డెన్ రాజారాం, పీజిక ల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు.పీఈటీ రమేష్, తదితర ఉపాధ్యాయు లు, పాఠశాల విద్యార్దులు అభింనందించారు.