జాతీయ స్థాయి సబ్ జూనియర్స్ కోకోలో ఆశ్రమ పాఠశాల విద్యార్థి ప్రతిభ
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని చిన్న బోయినపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థి మాసయ్య రవి చతిస్గడ్ లో జరిగిన కోకో సబ్ జూనియర్స్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని గెలుచుకుని జాతీయస్థాయి బెస్ట్ డిఫెండర్ అవార్డు కైవసం చేసుకున్నా డు. ఈ సందర్బంగా చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల ప్రధా నోపాధ్యాయులు నాగేశ్వరరావు, పి ఈ టి వెంకటేశ్వర్లు, పిడి రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.