అరుణాచల ఆర్టీసీ విబిఓ చంద్రమౌళికి ఘన సన్మానం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ సరికొత్త విధానాలతో దూసుకెళ్తున్న తరుణంలో అరుణాచల గిరి ప్రదక్షణ బస్సు టూర్ ప్యాకేజీని సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఆర్టీసీ కండక్టర్ విబిఓ వేల్పుల చంద్రమౌళిని ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ ఘనంగా సత్కరించారు. జులై నెలలో పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదక్షణ కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టిన ప్రత్యేక టూర్ ప్యాకేజీ లో భక్తుల చేత అత్యధి కంగా టికెట్లను బుకింగ్ చేసి, యాత్రను విజయ వంతంగా పూర్తి చేసుకొని, సురక్షితంగా ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు తిరిగి చేర్చినందుకుగాను ఆర్టీసీ కండక్టర్ వేల్పుల చంద్రమౌళి కర్తవ్య పాత్రను గుర్తించిన ఆర్టీసీ రీజినల్ మేనేజర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ లు మంగళవారం కరీంనగర్ కేంద్ర కార్యాలయం సమావేశం మందిరంలో చంద్ర మౌళిని ఘనంగా శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా తన విధి నిర్వహణలో భాగంగా విద్యుక్త ధర్మంగా భావించి ప్రయాణికుల అరుణాచల గిరి ప్రదక్షణ టూర్ ప్యాకేజీని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు, ఆ దేవుడే నాకు ప్రత్యక్ష శక్తిని ప్రసాదించారని, ఆర్టీసీ సంస్థకు రుణపడి ఉంటానని కండక్టర్ విబిఓ చంద్రమౌళి అన్నారు.