సారధి కళాకారుల కళా ప్రదర్శన
కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: జయశంకర్ భూపా లపల్లి జిల్లా కాటారం మండలంలోని గ్రామాలలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు కలెక్టర్, డిపిఆర్ఓ ల ఆదేశాలతో గ్రామాల్లో పర్యటిస్తూ కల ప్రదర్శనలు ఇస్తున్నారు. ఎడతెరిపిలేని వర్షాలకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మరుగుదొడ్డి వాడకం, పరిసరాల పరిశుభ్రత, దోమల వల్ల కలిగే జబ్బుల పై అవగాహన, మత్తు పానీయాలు, గంజాయి ఇతర మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దంటూ, మొక్కలు పెంచాలంటూ వారి కళారూపాలతో ప్రదర్శనలు ఇస్తున్నారు. అయితే గత మూడు నెలలుగా జీతాలు రావడంలేదని ఇల్లు గడవడం కష్టంగా ఉందని, ప్రయాణ ఖర్చులకు అప్పులు చేయవలసి వస్తుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి కళాకారుల జీతాలు వెంటనే వేయాలని వారు తమ గోడును వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఓనపాకల కుమార్ వారి బృందం పాల్గొన్నారు.