ప్రశ్నిస్తే అరెస్టులా..?
– ప్రజా సమస్యలను గాలి కొదిలిన కాంగ్రెస్ ప్రభుత్వం
– బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గండ్ర కోట సుధీర్ యాదవ్
ములుగు ప్రతినిధి : ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేస్తారా అని బిఆర్ఎస్ జిల్లా నాయకుడు గండ్రకోట సుధీర్ యాదవ్ ప్రశ్నించారు.ఈ సందర్భంగా సుధీర్ మాట్లా డుతూ బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా శుక్రవారం హైదరాబాదుకు వెళ్లే క్రమంలో ములుగు జిల్లా పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ములుగు పోలీస్స్టేషన్కు తరలిం చడం దుర్మార్గమని అన్నారు .టిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదని అన్నారు. ఎన్నిక ల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే దాడు లు చేయడం వారి అవివేకానికి నిదర్శనమని అన్నారు. ఓట్లు సీట్ల కోసమే తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యలపై దృష్టి లేద ని అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడం టిఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుందని అన్నారు. రాష్ట్రం లోని ప్రజాప్రతినిధులను టిఆర్ఎస్ కార్యకర్తలను హౌస్ అరె స్ట్ చేసి ముందస్తుగా కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలిం చడం సమంజసం కాదని అన్నారు.రాష్ట్రంలో నిరసన తెలిపే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వం కాలరాయడం ప్రభుత్వ నిరంకు శత్వ పాలనకు నిదర్శనం అని అన్నారు . ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోవింద నాయక్, ములుగు మండల పార్టీ అధ్యక్షుడు పాలేపు శ్రీనివాస్, కవ్వంపల్లి బాబు, ఆదిరెడ్డి, భాస్కర్, గణేష్, కళ్యాణ్, చుక్కయ్య, అంకుస్, కు మార్, లింగమూర్తి, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.