కే టి ఆర్ కి నిబంధనలు వర్తించావా ..?
కే టి ఆర్ కి నిబంధనలు వర్తించావా ..?
– సామాన్య భక్తులకు ఒక న్యాయం,కే టి ఆర్ కి మరో న్యాయమా..!
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : సామాన్య భక్తులకు ఒక న్యాయం, కే టి ఆర్ కి మరో న్యాయమా అని యూత్ కాంగ్రెస్ కాళేశ్వరం గ్రామ శాఖ అధ్యక్షులు నిట్టూరి నగేష్ అన్నారు. కాళేశ్వర ముక్తేశ్వర దేవ స్థానం గర్భాలయంలోకి ఎవరైనా లుంగీ పంచాతో వెళ్లే సంప్రదాయం దేవస్థానం లో ఉన్నది కానీ శుక్రవారం బిఆర్ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి ఆర్, వారి ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీ బి ఆర్ ఎస్ నాయకులు మాత్రం పాయింట్ లు షేర్ట్స్ పై వెళ్లి దర్శనం చేసుకున్నారు. వారికీ తెలియకపోతే కనీసం దేవస్థానం అధికారులు వారికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాన్య ప్రజలకు ఒకలా రాజకీయ నాయకులకు మరోలా దర్శనం చేపియడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటి కైనా దేవస్థానం అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.