వాడ బలిజ సేవా సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు చింతూరి వెంకటరావుకు సన్మానం.
వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి : తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో భద్రాచలం నియోజక వర్గం చర్ల మండలం మొగల్పల్లిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ చింతూరి ఇంటికి వెళ్లి సోమవారం నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్, ఉపాధ్యక్షులు గగ్గూరి రమణయ్య,అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లే భాస్కర్, వాడ బలిజ యువ నాయ కులు డాక్టర్ కొప్పుల రాంబాబు వరంగల్ జిల్లా అధ్యక్షులు గార ఆనంద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు గౌర్ల మధు, చర్ల మండల అధ్యక్షులు ఎర్రావుల ప్రేమ్, ముఖ్య సలహాదారి ఎక్కేల కుమార్, వాజేడు మండల అధ్యక్షులు గార నాగార్జున రావు, గార సురేష్ మొగల్ పల్లి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నట్లు ప్రకటనలో సంఘం తెలిపింది .