ఈనెల 10వ తేదీన వాజేడు ఐటిఐ కళాశాలలో అప్రెంటిస్ మేళ
ఈనెల 10వ తేదీన వాజేడు ఐటిఐ కళాశాలలో అప్రెంటిస్ మేళ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఈనెల 10వ తేదీన అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ట్రైనింగ్ ఆఫీసర్ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటిఐలో ఉత్తీర్ణులైన వారు తగు ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 10వ తేదీన వాజేడు ప్రభుత్వ ఐటిఐ కళాశాలకు హాజరు కావాలన్నారు. ఈ మేళాలో వివిధ ప్రముఖ కంపెనీలు అప్రెంటిస్ మేళాలో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తిగల వారు ఆయా సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలు కొరకు 9908119979 సెల్ నెంబర్ లో సంప్రదించాలని కోరారు.