కోర్టులో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి

కోర్టులో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి

– జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి వెంకటేశ్వర్లు

ములుగు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కోర్టు పరిధిలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ, ములుగు కార్యా లయంలో పనిచేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని, ఈనెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి పి.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో సూచించారు. ఆఫీస్ అసిస్టెంట్/ క్లర్క్ ఒక పోస్ట్ కు వేతనం రూ.20వేలు, డిగ్రీ ప్లస్ టైపింగ్ (40wpm) ఉండాలని, రిసెప్షనిస్ట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (టైపిస్ట్”) ఒక పోస్టు కు వేతనం రూ.15వేలు, డిగ్రీ రిటర్న్ స్కిల్’, టైపింగ్ (40wpm) కలిగి ఉండాలని, ఒక ఆఫీస్ ఫ్యూన్ జాబ్ కోసం వేతనం రూ.14వేలు, 7వ తరగతి పూర్తి చేసి ఉండాలని సూచించారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు పూర్తి చేసిన దరఖాస్తులను రిజిస్టర్ / స్పీడ్ పోస్ట్ ద్వారా లీగల్ సర్వీసెస్ అథారిటీ, ములుగు కార్యాలయానికి పంపించాలని సూచించారు. దరఖాస్తు ఫారం కోసం http://districts.ecours.gov.in /mulugu వెబ్సైట్ను సంప్రదించాలని, పూర్తి వివరాలకు 9849785546, 8297338888 నెంబర్లలో సంప్రదించవచ్చు అని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి తెలిపారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment