జూనియర్ కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై అవగాహన
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడంలో విద్యార్థులు, యువత సైనికుల్లా పని చేయాలనీ ఏటూరు నాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్ లు అన్నారు. ఏటూరు నాగారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధ వారం ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు, ఏటూరునాగారం ఏఎస్పి శివమ్, ఉపాధ్యాయుల సూచనల మేరకు మాదకద్రవ్యాలు, యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ హితం కోసం సామాజిక స్పృహతో డ్రగ్స్ సరఫరాను, వాడ కాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల వ్యక్తుల జీవితాలే కాకుండా ఆయా కుటుంబాలు,దేశం, సమాజం ప్రమాదంలో పడుతుందన్నారు. డ్రగ్స్ అలవాటు, అడిక్షన్‌గా మారుతుందని డ్రగ్స్ వాడకుండా ఉండడమే కాకుండా డ్రగ్స్ ఎక్కడ కనిపించినా అరికట్టేందుకు విద్యార్థులు తమ వంతు పాత్రను పోషించాలని సూచిం చారు. మాదకద్రవ్యాలను తీసుకోవడం వల్ల కేంద్ర నాడి వ్యవస్థపై పనిచేసే శరీర అవయవాలతో పాటు మెదడుపై ప్రభావం చూపిస్తుందన్నారు. పిల్లలు ఒత్తిడిని, స్ట్రెస్ ను తట్టుకోలేక వారు డ్రగ్స్ కు బానిసలవుతారన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.మాదక ద్రవ్యాలు కలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అన్నారు. మత్తును చిత్తు చేద్దాం. డ్రగ్స్ ను నిర్మూలించడంలో విద్యా ర్థులు సైనికుల పనిచేయాలన్నారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో కళాశాల విద్యార్థులు యువత ముందు వరుసలో ఉండాలని, ఈ క్రమంలోనే విద్యార్థులు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను, విద్యార్థులను చైతన్యం చేయాలని వివరించారు. డ్రగ్స్ వాడకాన్ని అరిక ట్టడంలో విద్యార్థులు సామాజిక బాధ్యతగా వ్యవహరిం చాలని సూచించారు. డ్రగ్స్ సరఫరాతో పాటు వాడకం అంతర్జాతీయంగా టెర్రరిజాన్ని తయారు చేస్తుందని తెలి పారు. డ్రగ్స్ తీసుకున్న విక్రయించిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.