ధర్మవరంలో హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో అన్నదానం.
– తరలివచ్చిన భక్తజనం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరంలో శనివారం రాత్రి హనుమాన్ దీక్షా స్వాములు గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి మందిరం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.శ్రీ హనుమాన్ దీక్ష స్వాముల ఆధ్వర్యంలో జరిగిన అన్నప్రసాద కార్యక్రమానికి, స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరిం చేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వాముల అన్నసంత ర్పణ ప్రసాద కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రామ, జయ రామ జయ జయ రామ అంటూ, అయోధ్యశ్రీ రాముడి అక్షింతల భక్తి రస కార్యక్రమం తో పాటు,శ్రీ హనుమాన్ స్వాముల మాల ధారణ స్వా ములు భక్తిపారవశ్యంతో నిర్వహించిన స్వాముల అన్నదానం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ధర్మారం గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాలుకు చెందిన భక్తులు స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న ప్రసాద కార్యక్రమాలలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పాడి పంటలు సక్రమంగా పండాలని, అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యా లు కలిగి ఉండాలని, అందరూ సుఖశాంతులతో జీవించాలని, శుభం కలగాలని ఈ సందర్భంగా శ్రీ హనుమాన్ మాలధారణ స్వాములు,భక్తులు పూజలు నిర్వహించారు.
1 thought on “ధర్మవరంలో హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో అన్నదానం.”