పిరమిడ్ జ్యోతికి గారేపల్లిలో అపూర్వ స్వాగతం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: పిరమిడ్ జ్యోతి చేపట్టిన యాత్రకు కాటారం మండల కేంద్రమైన గారేపల్లిలో బుధవారం ఘన స్వాగతం లభించింది. పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ జయ శంకర్ జిల్లా సేవాదల్ అధ్యక్షుడు అనంతుల రమేష్ బాబు, సెక్రెటరీ దారం నగేష్ కుమార్ వారి ఆధ్వర్యంలో బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ ఆశీస్సులతో కడ్తాల్ నుండి బయలు దేరినటువంటి చైతన్య దివ్య జ్యోతి రథ యాత్ర కాటారం రావడం జరిగింది. స్టేట్ ప్రచారకులు రహీం మాస్టర్, ఆర్కే రామకృష్ణ ల ఆధ్వర్యంలో ఈ దివ్య జ్యోతినీ పిరమిడ్ కాటారం ధ్యాన పరివారం అందరూ ఆజ్యోతినిఅంబేడ్కర్ కూడలి లో దర్శించుకొని, పిరమిడ్ నినాదాల తో రమేష్ బాబు ఇంటి కి స్వాగతం పలికారు. కాటారం పిరమిడ్ సాధకులు అంద రూ జ్యోతిని సందర్శించుకున్న అనంతరం, రెండు నిమిషాలు ధ్యానం చేసి కాళేశ్వరంకు జ్యోతి ని సాగనంపారు.ఈ కార్యక్రమం లో పిరమిడ్ జ్యోతి నిర్వాహకులు అనంతుల రమేష్ బాబు, అల్లా డి శ్రీనివాస్, చల్లా జక్కిరెడ్డి, బీరెల్లి అంజయ్య, వొన్న వంశవర్ధన్ రావు, దారం నగేష్, చిట్టూరి రవి, మాధవరావు, గద్దే సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.