చెట్టుకు ఉరేసుకొని వృద్ధుడు ఆత్మహత్య
తెలంగాణ జ్యోతి, కాటారం: చెట్టుకు ఉరేసుకొని ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాటారం మండలం ఒడిపిలవాంచ గ్రామంలో బుధవారం చోటుచేసు కుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిపిలవంచ గ్రామానికి చెందిన ఒన్న వెంకటస్వామి (70) మంగళవారం రాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో వెతికినా కనిపించలేదు. ఉదయం గ్రామంలో వెతకగా ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చింత చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందారు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహాదేవపూర్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.