మేడిగడ్డ బ్యారేజీ దుర్ఘటన పై విచారణ చేపట్టాలి

Written by telangana jyothi

Published on:

మేడిగడ్డ బ్యారేజీ దుర్ఘటనపై విచారణ చేపట్టాలి

  • మేడిగడ్డ బ్యారేజి వంతెన కుంగుబాటుకు సంఘటనపై తక్షణమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు విచారణ చేపట్టాలి
  • బి ఎస్ పి కాటారం మండల అధ్యక్షులు బొడ్డు రాజబాబు డిమాండ్ 

తెలంగాణ జ్యోతి, కాటారం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్లు వెచ్చించి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేసిన మెడిగడ్డ ప్రాజెక్ట మేడిపండు చందంగా మారిందని ఆయన అన్నారు.మెడి గడ్డ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టని , లక్షలాది ఎకరాలకు సాగు నీరు ప్రజలకు తాగునీరందించి తెలంగాణను శ్యాశ్యామలం చేస్తుందని గోప్పలు చెప్పిన  మఖ్యమంత్రి కే.సి. ఆర్, రాష్ట్ర మంత్రులు రామారావు, హరీష్ రావులు, కాంట్రాక్ట్ దారుల నుండి కోట్లాది రూపాయల కమిషన్స్ దండుకోని సరైన పర్యవేక్షణ చేయక పోవడంతో, ఇదే అదునుగా కాంట్రాక్ట్ దారుల ప్రాజెక్ట్ నిర్మాణంలో నాసిరకం నిర్మాణా సామాగ్రి వాడి లోప భూయి ష్టమైన డిజైనింగ్ లో ప్రాజెక్టు నాణ్యత కు తిలో దకాలి ఇవ్వడం తో గతంలో వర్షాలకు బాహుబలి మోటార్స్ నీట మునిగి లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని, అదేవిదంగా పాలిమేల మండలం ముప్పుకు గురికావడం జరిగింది, ముంపుకు గురై రెండు వందల అరువై ఒక్క గొర్రెలు కొట్టుకుపోవడము జరిగింది, బ్యాకు వాటర్ ద్వారా పంటలు దెబ్బతిన రైతులకు నష్టం వాటిలుతుంది నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం అందిచలని లేని పక్షములో ధర్నాలు చేస్తామని డిమాండ్ చేసారు మూడు రోజుల క్రితం ఇరవైవ నంబర్ పిల్లర్ వంతెన కృంగి పోవడంతో వంతెన భవిష్యత్ ప్రశ్నర్థకంగా మారిందని బొడ్డు రాజబాబు ఆవేదన వ్యక్తం చేశారు.మెడిగడ్డ బ్యారేజి వంతెన కుంగుబాటుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే సి ఆర్ నైతిక బాధ్యత వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ కాటారం మండల శాఖ తరుపున బొడ్డు రాజబాబు డిమాండ్ చేశారు

1 thought on “మేడిగడ్డ బ్యారేజీ దుర్ఘటన పై విచారణ చేపట్టాలి”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now