నూగూరు వెంకటాపురం విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
నూగూరు వెంకటాపురం విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధిలోని ఆలుబాక, వెంకటాపురం పట్టణం లోనీ విద్యుత్ సబ్స్టేషన్ల లో మరమ్మత్తులు కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడిఈ స్వామి రెడ్డి ఒక ప్రటనలో వినియో గదారులకు విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం, భవిష్యత్తులో సంభవించే గోదావరి వరదల కారణంగా, ప్రక్రుతి వైపరీత్యాల సమయాల్లో కూడా నిరంతర విద్యుత్ సరఫరాకు ఆటంకాలు రాకుండా వినియోగ దారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించే దిశగా మరమ్మత్తులు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు విద్యుత్ వినియోగదారులు అందరూ సహకరించాలని ఆ శాఖ అధికారిక ప్రకటనలో వినియోగదా రులకు విజ్ఞప్తి చేశారు.