గర్భిణికి పురుడు పోసిన అంబులెన్స్ టెక్నిషియన్

గర్భిణికి పురుడు పోసిన అంబులెన్స్ టెక్నిషియన్

గర్భిణికి పురుడు పోసిన అంబులెన్స్ టెక్నిషియన్

– ఆనందం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు

తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం: ఏడు నెలల గర్భిణిని  అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకు వస్తున్న క్రమంలో అంబు లెన్స్ లోనే టెక్నీషియన్ పురుడు పోశాడు. వివరాలు ఇలా ఉన్నాయి… ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం లోని మారుమూల గిరిజన ప్రాంతమైన రంగపురం గ్రామానికి చెందిన గర్భిణి ఇర్ప మహేశ్వరికి పురిటి నొప్పులు రావడంతో దగ్గర్లోని 108 అంబులెన్స్ కి స్థానిక ఆశ వర్కర్ సహాయంతో సమాచారం అందించారు. విషయం తెలుసుకు న్న 108 సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నా రు.గర్భిణీ స్త్రీని పరీక్షించగా 7 నెలల గర్భిణీ అని తెలియ డంతో ఈఆర్సిపి డాక్టర్ మౌనిక సూచనలతో ప్రధమ చికిత్స అందించి, మెరుగైన వైద్యసేవలకై ములుగు జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో చల్వాయి గ్రామ శివారులో పురిటి నొప్పులు అధికం అవడాన్ని గమనించిన ఈఎంటి శివలింగంప్రసాద్ చాకచక్యంగా వ్యవహరించి గర్భిణీ కి సుఖ ప్రసవం చేసి మగ బిడ్డకు పురుడు పోశాడు. తల్లి బిడ్డలకు కావలసిన సేవలందిస్తూ మెరుగైన వైద్యకోసం ములుగు జిల్లా ఆసుపత్రికి చేరుకోగా, వైద్యులకు జరిగిన విషయాన్ని వివరించి అడ్మిట్ చేశారు.

ఉమ్మనీరు తక్కువగా ఉంది

నవమాసాలు నిండని గర్భిణికి పురిటి నొప్పులు రావడం తో ఆందోళనకు గురైన గర్భిణీ స్త్రీ కుటుంబ సభ్యులు సుఖ ప్రసవం చెయ్యగా ఆనందం వ్యక్తం చేసి 108 సిబ్బందికి కృత జ్ఞతలు తెలిపారు. ఆపదని తెలిసి తక్షణమే స్పందించి రెండు ప్రాణాలను కాపాడిన అంబులెన్స్ సిబ్బందిని జిల్లా ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ చంద్రశేఖర్ అభినందించారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment