అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చెయ్యాలి. 

అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చెయ్యాలి. 

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చెయ్యాలని అంబేద్కర్ వాది పల్లె నాగరాజు అన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బీ ఆర్.అంబేద్కర్ 134 వ జయంతినీ పురస్కరించుకొని మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్బంగా పల్లె నాగరాజు మాట్లాడుతూ ఏప్రిల్ 14,1891వ సంవత్సరంలో రాంజీ సక్పపాల్, భీమ బాయి దంపతులకు మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని మౌ అనే గ్రామంలో మహర్ అనే దళిత కులంలో జన్మించారు అన్నారు. విద్యా ద్వారానే బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలు బాగుపడుతాయి అని అంబేద్కర్ భావించేవాడు అన్నారు. అందుకే అన్ని సామజిక వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యా అందించడానికి కృషి చెయ్యాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొర్ర రాజన్న పోరిక శంకర్, పబ్బు వెంకటేశ్వర్లు, అక్బర్ పాషా, చాట్ల రవి, తొంగల వెంకటేశ్వర్లు, పోరిక రాజు కుమార్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment