కాటారం, మహాదేవపూర్ మండలాల్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
– ముఖ్య అతిథిగా పాల్గొంటున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జడ్పీ చైర్మన్లు పుట్ట మధుకర్, జక్కు శ్రీ హర్షిని
కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహాదేవపూర్ మండలాల్లో శనివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంథని బి.ఆర్.ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పెద్దపెల్లి మాజీ జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ భూపాలపల్లి మాజీ జెడ్పి చైర్మన్ జక్కు శ్రీ హర్షిని పర్యటిస్తున్నారు. మహాదేవపూర్ మండలంలోని సూరారం గ్రామంలో శనివారం ఉదయం 9 గంట లకు నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరి స్తారు. కాటారం మండల కేంద్రం గారె పెళ్లి అంబేడ్కర్ కూడలిలో బహుజన సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ స్తూపం ను శనివారం ఉదయం 10 గంటలకు ఆవిష్కరిస్తారు. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్మన్లు పుట్ట మధుకర్, జక్కు శ్రీ హర్షిని పాల్గొం టున్నారని బి.ఆర్.ఎస్ అభిమానులు, నాయకులు, కార్యకర్త లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బిఆర్ఎస్ నాయకులు కోరారు.