అంబేద్కర్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో మంగళవారం రోజున ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగాల రామయ్య మండల అధ్యక్షులు మేరుగు లక్ష్మణ్ ఆధ్వర్యంలో కాళేశ్వరంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘ గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాళేశ్వరం గ్రామ కమిటీ అధ్యక్షులు గా చకినారపు సమ్మయ్య ఉపాధ్యక్షులుగా గోర శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శిగా లేతకారి చరణ్ దాస్ సహాయ కార్యదర్శిగా ఇనుముల సంతోష్ కోశాధికారిగా మేకల మహేష్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బెల్లంపల్లి రాజయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సభ్యులు మేకల సురేష్ బొల్లం కిషన్ రెవెల్లి సంతోష్ గోర దేవయ్య చాకినారపు రాజబాబు మోతే తిరుపతి లేతకరి శ్రీనివాస్ లేతకరి రవి లేతకరి అశోక్ మోతె రాజయ్య సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.