అంబేద్కర్ జయంతిని అధికారికంగా ఘనంగా నిర్వహించాలి:ఏ వై ఎస్
– అంబేద్కర్ యువజన సంఘం మండల కన్వీనర్ ఇసునం మహేందర్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఏప్రిల్ 14 నాడు ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలని కుల, మత బేధాలు లేకుండా రాజ్యాంగ బద్దంగా నడుచుకుంటున్న ప్రతి పౌరుడు, అధికారులు, రాజకీయ నాయకులు, కుల సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్ జయంతిలో పాల్గొని విజయవంతం చేయాలని అంబేద్కర్ యువజన సంఘం కాటారం మండల కన్వీనర్ ఇసునం మహేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి పేరు రావడానికి కారణం అంబేద్కర్ అని అతనే గనుక లేకుంటే ఈ దేశం మరుగున పడిపోయేదని ఈ దేశంలో ఉన్న 80 శాతం ప్రజలు బానిస బ్రతుకులు బ్రతికే వారని, మహిళలు మనుషులుగా కూడా గుర్తింపు లేకుండా ఉండేవారని, కుల, మత ఘర్షణలతో భారతదేశం అతలాకుతలం అయి ఉండేదని ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అని అలాంటి రాజ్యాంగం అందించిన అంబేద్కర్ జయంతిని అధికారులు ఘనంగా నిర్వహించాలని భారత దేశ ప్రతి పౌరుడు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.