ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

కాటారం, తెలంగాణ జ్యోతి : అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అడుగుజాడల్లోనే నడవాలని భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఫలాలు సాధించేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని 134 వఅంబేడ్కర్ జయంతి రోజున పలువురు వక్తలు పేర్కొన్నారు. కాటారం మండల కేంద్రం గారెపల్లి చౌరస్తా లోగల అంబేద్కర్ విగ్రహానికి రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాల నేతలు, అంబేద్కర్ కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాటారం మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంబేద్కర్ మండల యువజన సంఘం ఆధ్వర్యంలో బయ్యారం గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి కాటారం డి.ఎస్.పి.జి రామ్మోహన్ రెడ్డి, ఎంపీడీవో అడ్డూరి రాజు, రెవెన్యూ ఆఫీసులో తహసిల్దార్ నాగరాజు, ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మౌనిక అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాటారం మండలం లోని ఇబ్రహీంపల్లి గ్రామంలో ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దళితులంతా అంబేద్కర్ అడుగు జాడల్లో నడుస్తూ అందరికీ స్ఫూర్తి దాయకంగా ఉండాలని కాటారం ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మాదిగ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ మండల ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీధర్, నాయకులు తాళ్లపల్లి కృష్ణ,కనుకుట్ల రవి, కోలుగురి సంతోష్, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment